ఎమ్మెల్యేను కలిసిన గోదావరి జిల్లా సాధన సమితి సభ్యులు
ELR: ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజునీ ఇవాళ ఆయన క్యాంపు కార్యాలయంలో గోదావరి జిల్లా సాధన సమితి సభ్యులు కలిశారు. ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా మార్పు చేయుట కొరకు వారికి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే స్పందించి గోదావరి జిల్లాగా తన మద్దతు తెలియజేస్తున్నట్లుగా సభ్యులు వివరించారు.