వీధి కుక్కల బీభత్సం: దూడ మృతి

వీధి కుక్కల బీభత్సం: దూడ  మృతి

MDK: నిజాంపేట మండలంలోని నందగోకుల్ గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. రోజురోజుకూ వీటి ఉధృతి పెరిగిపోతుండటంతో అటు రైతులు, ఇటు గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. శనివారం గ్రామంలోని పాడి పశువుల మీద వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో, ఒక లెగదూడ మరణించింది.