ఈ మిఠాయిలు తినొద్దు: ఆహార భద్రత అధికారి

ఈ మిఠాయిలు తినొద్దు: ఆహార భద్రత అధికారి

KRNL: నగరంలో ఆహార భద్రత అధికారి రాజగోపాల్ నాలుగో పట్టణ పీఎస్ పరిధిలో ఇవాళ తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు నిషేధిత రోడమిన్-బీ రంగు చక్కెర మిఠాయిని అమ్ముతుండగా గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. ఈ రంగు మిఠాయిల వల్ల పిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోశ సమస్యలు వస్తాయని రాజగోపాల్ తెలిపారు. ఇది సురక్షితం కాని ఆహారమని, మానవ వినియోగానికి తగినది కాదని చెప్పుకొచ్చారు.