'మా తండాలకు బస్సు సౌకర్యం కల్పించాలి'
MBNR: పల్లెలకు నిలిచిపోయిన బస్సు సర్వీస్‌లను పునరుద్ధరించాలని వివిధ గ్రామాల సర్పంచులు మహబూబ్నగర్ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. లంబాడి హక్కుల నేత రాములు నాయక్ మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం ఉచిత బస్సులు ఉన్న అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు మహిళలు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మణికొండ నుంచి కోయిలకొండ వరకు బస్సులు నడపాలన్నారు.