'బాసర క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం'
NRML: బాసర పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం వారు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఏప్రిల్ 6 న ముఖ్యమంత్రి బాసర పర్యటనకు రానున్నారని, పర్యటనలో భాగంగా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అక్కడి అధికారులను ఆదేశించారు.