వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో దండోరా వేయాలి: కలెక్టర్

వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో దండోరా వేయాలి: కలెక్టర్

PPM: జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే సూచన నేపద్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరగకూడదని చెప్పారు. ఇందుకోసం గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.