VIDEO: షాక్ సర్క్యూట్‌.. ఇల్లు దగ్ధం

VIDEO: షాక్ సర్క్యూట్‌.. ఇల్లు దగ్ధం

MHBD: గంగారం మండలం మడగుడ గ్రామానికి చెందిన యాప కిరణ్ ఇంట్లో విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా, గృహోపకరణాలు కాలిపోయి భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు.