భవన నిర్మాణ కార్మికుల సమావేశం: IFTU
GDWL: ఐజ మండలంలో భవన నిర్మాణ కార్మికులతో శుక్రవారం జరిగిన సమావేశంలో ఐఎఫ్‌టీయు గద్వాల జిల్లా ప్రధాన కార్యదర్శి కార్తీక్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణం ఇతర నిర్మాణాల కార్మికుల చట్టం 1996 ప్రకారమే కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ చట్టం ప్రకారమే కార్మికుల ఉపాధి, భద్రత, ఆరోగ్యం వంటి అంశాలు అమలవుతాయని తెలిపారు.