గుడుంబా పట్టివేత
SRCL: వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామం వద్ద శనివారం రాత్రి పోలీసులు నిషేధిత గుడుంబాను పట్టుకున్నారు. నమిలిగుండుపల్లి గ్రామానికి చెందిన పల్లెపు మల్లేశం అనే వ్యక్తి మోటార్ సైకిల్‌పై అనుమానాస్పదంగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అతడిని తనిఖీ చేయగా అతని వద్ద 3 లీటర్ల నిషేధిత గుడుంబా లభ్యమైంది. అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.