అత్యధిక ధనిక జిల్లాగా రంగారెడ్డి

అత్యధిక ధనిక జిల్లాగా రంగారెడ్డి

RR: దేశంలోనే అత్యధిక ధనిక జిల్లాగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నిలిచింది. ఎకనామిక్ సర్వే (2024-25) ప్రకారం తలసరి జీడీపీలో దేశంలోనే రంగారెడ్డి తొలిస్థానంలో ఉంది. దీని తలసరి జీడీపీ రూ.11.46 లక్షలు ఉండగా.. ఐటీ, ఫార్మా కంపెనీలు, మెరుగైన కనెక్టివిటీ దీనికి ప్రధాన కారణాలు. దీని తర్వాత గురుగ్రామ్ రూ.9.05 లక్షలతో రెండో స్థానంలో ఉంది.