VIDEO: ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని టవర్ ఎక్కిన రైతు
MHBD: కేసముద్రం మండలం మహమూద్‌పట్నం గ్రామానికి చెందిన యాశబోయిన మురళీ అనే రైతు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పలుమార్లు అధికారులను సంప్రదించినా ఎటువంటి స్పందన లేకపోవడంతో నిరసనగా సెల్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన కిందకు దిగివచ్చాడు.