VIDEO: మార్కాపురంలో మార్కండేశ్వర స్వామి రథోత్సవం

ప్రకాశం జిల్లా మార్కాపురం జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి పర్యవేక్షణలో జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలకు అర్చకులు ఆంజనేయ శర్మ, వరుణ్ తేజ్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథం పై ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి పురవీధులలో శివనామస్మరణతో ఊరేగింపు చేశారు.