80 వేల నగదు బంగారం వెండి అగ్నికి ఆహుతి

విశాఖ: కొయ్యూరు గ్రామంలో శనివారం సాయంత్రం సంబంధించిన అగ్ని ప్రమాదంలో గారే సూర్యకాంతం తాటాకిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సూర్యకాంతం దాచుకున్న 80 వేల నగదు, బంగారం, వెండి, తిండి గింజలు, గృహపకరణాలు సర్వం అగ్నికి ఆహుతై బాధితురాలు కట్టుబట్టలతో మిగిలింది. సర్వం కోల్పోయిన తన కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతోంది.