భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

VSP: బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గురువారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా నియంత్రించాలని కోరారు. తాగునీరు కలుషితం కాకుండా పరిష్కరించాలని సూచించారు.