ఢిల్లీలో సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపీ

NLR: ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబును గురువారం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆహ్వానం పలికారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఎంకి స్వాగతం పలికారు. ఎంపీని సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు.