VIDEO: 'మోతాదుకు మించి యూరియాతో నష్టం'

E.G: రైతులు అవసరానికి మించి యూరియా వినియోగిస్తే నష్టపోతారని ప్రాజెక్టు జిల్లా ఎగ్జిక్యూటివ్ వరలక్ష్మి అన్నారు. తాళ్లపూడి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో యూరియా, నానో యూరియా వాడకంపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంతో పాటు ప్రాజెక్ట్ జిల్లా ఎగ్జిక్యూటివ్ వరలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, సమీకృత వ్యవసాయ సీఆర్పీలు పాల్గొన్నారు. అనంతరం యూరియా వాడకంపై అవగాహన కల్పించారు.