'ప్రతీ విద్యార్థి సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి'

SRPT: ప్రతి విద్యార్థి సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని నూతనకల్ ఎస్సై నాగరాజు అన్నారు. సోమవారం నూతనకల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో డ్రగ్స్, సైబర్ నేరాల పైన నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటి సమాజంలో విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహనతో పాటు, అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.