కాటారంలో అంబులెన్స్‌ను తనిఖీ చేసిన జిల్లా మేనేజర్

BHPL: కాటారం మండల కేంద్రంలోని 108 అంబులెన్స్‌ను 108 జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వాహనంలోని మందులు, వైద్య పరికరాల పనితీరును సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మందులను అందుబాటులో ఉంచుకొని, కాల్ వచ్చిన వెంటనే వేగంగా సేవలందించాలని సిబ్బందికి సూచించారు.