ఘనంగా కనకమహాలక్ష్మి రథయాత్ర
విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం రథయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జగదాంబ సమీపంలోని అంబికాబాగ్ నుంచి ఆలయం వరకు జరిగిన ఈ రథయాత్రను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో రథయాత్ర నేత్రపర్వంగా సాగింది.