ప్రతాప్ గౌడ్ మృతి పార్టీకి తీరని లోటు: ఎమ్మెల్యే
GDWL: మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ మృతి పార్టీకి తీరని లోటు అని ఆయన సేవలు మరువలేనివి అని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం అనంతపురం గ్రామంలోని ఎమ్మెల్యే వారి స్వగృహం చేరుకుని ఆయన పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రతాప్ గౌడ్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.