VIDEO: అయినవిల్లిలో రహదారులా.. నరకానికి దారులా?
కోనసీమ: ఈ రహదారికి మోక్షం లేదా అని ప్రయాణికులు అంటున్నారు. అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం ప్రధాన రహదారి పెద్ద గుంతలతో నరకానికి దారులు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వాలు మారినా రహదారి మాత్రం నిర్మించడం లేదని వాపోతున్నారు. నిత్యం స్కూల్ బస్సులు ఈ గోతులలోనే ప్రయాణం చేస్తుంటాయి. రోడ్డు ఎలాగూ నిర్మించరు, కనీసం గోతులైనా పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.