చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: అవనిగడ్డ వంతెన సెంటరులో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శనివారం చలివేంద్రం ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు సతీమణి ప్రభావతీ వర్ధంతి సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే తమ కుటుంబ సభ్యులతో కలిసి నిరుపేదలకు వస్త్రదానం చేశారు. కృష్ణారావు-ప్రభావతీ దేవి చిత్రపటానికి నివాళులర్పించారు.