జర్నలిస్టుల ఆరోగ్యంపై దృష్టి
KRNL: జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇవాళ కలెక్టర్ డా. ఏ.సిరి సూచించారు. కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో కర్నూలులో జర్నలిస్టులకు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో వంటి పలు ఆరోగ్య పరీక్షలు చేపట్టారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.