గొలుసు చోరీలో నిందితుడిని పట్టుకున్న పోలీసులు
KMR: తాడ్వాయి మండలం ఎండ్రియాల్‌లో జరిగిన గొలుసు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆన్‌లైన్ ఆటలకు బానిసై అప్పుల పాలైన అదే గ్రామానికి చెందిన బాణాల తిరుపతి రెడ్డి, కత్తితో బెదిరించి 3 తులాల గొలుసు దొంగిలించాడు. CC టీవీ ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసి, బంగారం స్వాధీనం చేసుకున్నారు. వేగంగా కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని SP రాజేశ్ చంద్ర అభినందించారు.