సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్

MNCL: వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం భారీ వర్షాల నేపథ్యంలో గురువారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉపాధ్యాయులకు సెలవు లేదని, పాఠశాలకు హాజరు కావాలని సూచించారు.