ఎన్నికల హామీలు నెరవేర్చాలని ధర్నా

NRPT: ఎన్నికల సందర్భంగా వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. సోమవారం నారాయణపేట తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి వ్యవసాయ కూలికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూ. 12000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూలీలు, నాయకులు పాల్గొన్నారు.