PRTUరాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎర్ర హరికిషన్ ఎన్నిక

SRPT: తుంగతుర్తికి చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ హరికిషన్ ఎర్ర ప్రోగ్రెసివ్ రికగ్నైజేషన్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా శుక్రవారం ఎన్నికయ్యారు. సంఘం బలోపేతం తోపాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, గుండు లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు.