రైతు భరోసాకు దరఖాస్తుల ఆహ్వానం
JN: నర్మెట్ట మండలంలోని రైతన్నలకు వ్యవసాయ శాఖ అధికారులు శుభవార్త చెప్పారు. కొత్త పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకం లబ్ధి పొందేందుకు ఈనెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి అక్కిరెడ్డి కరుణాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పట్టాపాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జీరాక్స్ ప్రతులను గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలని సూచించారు.