నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

WNP: జిల్లాలో వాహనాల పరిమితికి మించి ప్రయాణించకూడదని శనివారం ఎస్పీ రావుల గిరిధర్ వాహన చోదకులను హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రజలు సురక్షితంగా గమ్య స్థానాలు చేరుకోగలరని ఆయన తెలిపారు. పరిమితికి మించి ప్రయాణించి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని రావుల గిరిధర్ సూచించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.