ఘనంగా బోనాల పండుగ వేడుకలు

NGKL: మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడలో కర్రెమ్మ, పోచమ్మ బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా గ్రామ దేవతలకు సంప్రదాయబద్ధంగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. బోనాలతో ఊరేగింపుగా బయలుదేరిన మహిళలు, శివసత్తుల నృత్యాల మధ్య కర్రెమ్మ, పోచమ్మ దేవతలకు ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు.