తిరుపతిలో ఘనంగా శ్రావణ సంగీత లహరి

తిరుపతిలో ఘనంగా శ్రావణ సంగీత లహరి

TPT: భారతీయ విద్యాభవన్ శ్రీ వేంకటేశ్వర విద్యాలయంలో శుక్రవారం ఘనంగా శ్రావణ సంగీత లహరి కార్యక్రమం జరిగింది. సభాధ్యక్షులు డా. నడింపల్లి సత్యనారాయణ రాజు భారతీయ సంస్కృతి విలువలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరంపై వివరించారు. ఈ మేరకు విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం పాఠశాల యాజమాన్యం అతిథులను ఘనంగా సత్కరించింది.