రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన చిట్యాల ఈశ్వర్ (45) అనే మూగ వ్యక్తి నెక్కొండ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం ఉదయం పట్టాలు దాటుతుండగా, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.