23 కోట్ల విలువ గల ఆల్ఫ్రాజోలం పట్టివేత

23 కోట్ల విలువ గల ఆల్ఫ్రాజోలం పట్టివేత

AP: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో భారీగా ఆల్ఫ్రాజోలంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.23.88 కోట్ల విలువైన 119.4 కిలోల ఆల్ఫ్రాజోలం పట్టుకున్నారు. అక్రమంగా ఆల్ఫ్రాజోలం తరలిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. గిడ్డంగిలో తయారు చేసి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఆల్ఫ్రాజోలంతో పాటు 87.8 కిలోల ముడిసరుకును స్వాధినం చేసుకున్నారు.