VIDEO: గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
BHPL: చిట్యాల మండలం ముచినిపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన కొత్త గృహాలకు లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరిన్ని అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను అందించేందుకు పథకాన్ని విస్తరిస్తామని ఆయన తెలిపారు.