VIDEO: కొండిపర్రులో CMRF చెక్కులు పంపిణీ
కృష్ణా: కొండిపర్రు గ్రామానికి చెందిన తసవలం వెంకట సుబ్బమ్మ, వీరంకి వీరమ్మకి, కత్తుల లాజరుబాబుకి మంజూరైన రూ. 83,566 CMRF చెక్కులను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మంగళవారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సహాయ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.