హార్వర్డ్ వర్సిటీకి కోత.. భారతీయులపై ప్రభావం

హార్వర్డ్ వర్సిటీకి కోత.. భారతీయులపై ప్రభావం

హార్వర్డ్ వర్సిటీకి ట్రంప్ సర్కారు మరో కోత విధించింది. వర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఇప్పటికే చదువుతున్న విద్యార్థులు ఇతర వర్సిటీల్లో చేరాలని సూచించింది. చేరకపోతే నాన్ ఇమ్మిగ్రెంట్ హోదాను కోల్పోతారని హెచ్చరించింది. ట్రంప్ నిర్ణయం భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపనుంది.