మద్ది క్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రి

మద్ది క్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రి

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి క్షేత్రాన్ని మంగళవారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థశారధి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనాలు అందించి సత్కరించారు. స్వామి వారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని మంత్రికి అందజేశారు.