'సమన్వయంతో పనిచేసి సమస్యలు పరిష్కరించాలి'
ప్రకాశం: పామూరు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ లక్ష్మి అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉగ్ర నర్సింహారెడ్డి హాజరై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలన్నారు.