'అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు'
SRPT: కోదాడ నియోజకవర్గంలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడ సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణ, అక్రమ రవాణా విషయాలపై జిల్లా ఎస్పీ ఆదేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపట్టినట్టు డీఎస్పీ తెలిపారు.