ఇకపై ఏటా డీఎస్సీ: మంత్రి లోకేష్

ఇకపై ఏటా డీఎస్సీ: మంత్రి లోకేష్

AP: ఇకపై ప్రతిఏటా డీఎస్సీ ప్రకటించి ఖాళీలను భర్తీ చేయనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో ఆయన విద్యాశాఖపై రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించి, విజయవంతంగా నిర్వహించామని అన్నారు. అనవసరమైన శిక్షణా కార్యక్రమాలతో ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని వృధా చేయవద్దని ఆదేశించారు.