తెనాలిలో రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
GNTR: తెనాలి మండలం ఎరుకలపూడి వద్ద చెన్నై-విజయవాడ రైలు మార్గంలో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పట్టాలపై మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న తెనాలి జీఆర్పీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు సుమారు 30 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నాడని ఆచూకీ తెలిసిన వారు తెనాలి పోలీసులను సంప్రదించాలని కోరారు.