కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
MNCL: లక్షెట్టిపేట తాలూకాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గురువారం ఉదయం తాలూకా పరిధిలోని లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాలతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 11 నుంచి 13 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శీతల గాలుల ప్రభావంతో చలి తీవ్రత కూడా పెరిగింది.