మాజీ మంత్రి ఆధ్వర్యంలో కోటీ సంతకాలు సేకరణ
SKLM: మాజీమంత్రి, వైసీపీ రాష్ట్ర డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో శనివారం పలాస బస్టాండ లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే ఎంతోమంది పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇందులో నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంతోష్, పట్టణ అధ్యక్షుడు గోపి పాల్గొన్నారు.