రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KMM: మధిర మండలం మాటూరుపేట ఫీడర్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతులు నిర్వహిస్తున్నందువల్ల రేపు కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని మధిర గ్రామీణ విద్యుత్ శాఖ ఏఈ ఎస్.మైథిలి తెలిపారు. మాటూరుపేట, నాగవరపాడు, సైదల్లిపురం, సిద్ధినేనిగూడెం, అంబారుపేట గ్రామాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆమె పేర్కొన్నారు.