పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్
నెల్లూరు రూరల్ 33వ డివిజన్ వెంగళరావునగర్‌లో పింఛన్ల పంపిణీ బుధవారం మొదలైంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి నగదు అందజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 4 వేలు పింఛన్ అమలు చేసిన మంచి ప్రభుత్వం తమదని చెప్పారు. అన్ని డివిజన్‌లో పింఛన్ పంపిణీ జరుగుతోందన్నారు.