గజ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు
KDP: బ్రహ్మంగారిమఠంలో మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగవ రోజు మంగళవారం మధ్యాహ్నం గజ వాహనంపై గోవింద మాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. గ్రామ వీధులలో విహరించారు. ఈ సందర్భంగా పలువురు స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు, భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.