చౌటుప్ప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్‌గా మోదుగాల పావ‌ని

చౌటుప్ప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్‌గా మోదుగాల పావ‌ని

BHNG: చౌటుప్పల్ మున్సిప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్‌గా మోదుగాల పావ‌ని ర‌మేశ్ గౌడ్‌, వైస్ ఛైర్మ‌న్‌గా గోసిక విన‌య్ ఎన్నిక‌య్యారు. ఈ ఎన్నిక సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో నిర్వహించారు. ఈ ప్రత్యేక సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యుడు, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు 12మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ సభ్యులు పాల్గొన్నారు.