ఎంపీడీవోకు సత్కారం
AKP: నాతవరం ఎంపీడీఓ ఎంఎస్ శ్రీనివాస్‌ను శనివారం ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కోండ్రు మరిడయ్య సత్కరించారు. ఎంపీడీఓ శ్రీనివాస్ కృషి వల్ల మండలంలో స్పౌజ్ కోటలో అధిక పింఛన్లు రావడం జరిగిందని, దీంతో ఎంపీడీఓను సత్కరించడం జరిగిందని చెప్పారు. అనంతరం పలు సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పారుపల్లి కొండబాబు, హౌసింగ్ జేఈ జోగారావు పాల్గొన్నారు.