VIDEO: రైతుల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి
కృష్ణా: గుడివాడ నియోజకవర్గ రైతాంగ సమస్యల పరిష్కారానికి సహకరించాల్సిందిగా పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం విజ్ఞప్తి చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా గుడివాడ మీదుగా వెళుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే రాము ఆహ్వానం మేరకు రాజేంద్రనగర్‌లోని ఆయన స్వగహానికి బుధవారం తేనీటి విందును ఆస్వాదించారు.