ఘనంగా YSRTUC ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా YSRTUC ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కడప నగరంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో YSRTUC ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు జాషువా, నగర అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా CEC సభ్యులు కె. సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా, మాజీ మేయర్ పాక సురేష్ కుమార్, తదితరులు హాజరయ్యారు.